ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశలో కదలడం వలన రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వర్ష సూచన నేపథ్యంలో రేపు నెల్లూరు జిల్లాలోని పాఠశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa