కృష్ణా జిల్లా పామర్రులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జమీగొల్వేపల్లి నివాసి ఎస్.బాలాజీ.. తన భార్య శకుంతల(38)తో బైక్‌పై వెళ్తుండగా మచిలీపట్నం-విజయవాడ రహదారిపై కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య తీవ్ర గాయాలతో చనిపోవడంతో, బాలాజీ ఆమెను ఒడిలో పెట్టుకుని “ఒక్కసారి లే శకుంతలా” అని బోరున విలపించాడు. ప్రాణం ఉందేమోనన్న ఆశతో ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే చనిపోయిందని ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa