ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా తగ్గనున్న చికెన్ ధరలు.. ఎందుకంటే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 06:01 PM

కార్తీక మాసం ప్రారంభం కావడంతో మాంసాహారం వినియోగం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పడిపోవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. శివారాధనలో భాగంగా చాలామంది ఈ నెలలో మాంసం తినడం మానేయడంతో చికెన్‌కు డిమాండ్ తగ్గనుంది. ప్రస్తుతం ప్రాంతానుసారం కోడి మాంసం కేజీ ధర రూ.210 నుంచి రూ.250 వరకు ఉండగా, వచ్చే రెండు మూడు రోజుల్లో చికెన్ ధర రూ.170-180కి దిగొచ్చే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa