రోహిత్ శర్మ ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ కఠోర దీక్షతో ఫ్యాట్ నుంచి ఫిట్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫిట్‌గా మారి ఆస్ట్రేలియా సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇంతటితో ఆగకుండా తన ఫిట్‌నెస్ జర్నీని, ఫామ్‌ని ఇంకా కొనసాగించాలని రోహిత్ ఫిక్సయ్యాడు. ఇప్పటికే 11 కిలోల బరువు తగ్గిన రోహిత్, ఇక్కడితో ఆగడని.. మరికొన్ని కిలోలు తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నాడని టీమిండియా మాజీ కోచ్, రోహిత్ ఫిట్‌నెస్ ట్రైనర్ అభిషేక్ నాయర్ వెల్లడించాడు.
జియో హాట్‌స్టార్‌లో నాయర్ మాట్లాడుతూ “గత మూడు నెలలుగా రోహిత్ చాలా క్రమశిక్షణతో ఉన్నాడు. తనకు ఇష్టమైన వడపావ్ వంటి ఫేవరేట్ ఫుడ్‌కి దూరంగా ఉండి, కఠినంగా వర్కౌట్స్ చేస్తున్నాడు. టీమిండియా రానున్న వన్డే సిరీస్‌లో మళ్లీ ఆడే సమయానికి రోహిత్ మరింత సన్నగా కనిపించే అవకాశం ఉంది” అని అన్నాడు.
ఆస్ట్రేలియా టూర్‌కు ముందు మూడు నెలల పాటు రోహిత్‌తో కలిసి పనిచేసిన నాయర్ “ఇప్పుడతడు బాడీబిల్డర్‌లా జిమ్‌లో శ్రమిస్తున్నాడు. అతడు ఎంత కష్టపడుతున్నాడో చూడాలి. ఫిట్‌నెస్ పరంగా రోహిత్ మరో స్థాయికి వెళ్తున్నాడు” అని వ్యాఖ్యానించాడు. రోహిత్ కష్టపడిన దానికి ఆస్ట్రేలియా టూర్‌లో ఫలితం దక్కింది. సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో అద్భుత శతకంతో రాణించాడు విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 168 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేసి, భారత్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియాకు విజయాన్ని అందించాడు.
ఈ విజయంతో శుభమన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో వైట్‌వాష్ కాకుండా నిలిచింది. సిరీస్ 2-1తో ముగిసినా, రోహిత్-విరాట్ జంట సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రదర్శించిన బ్యాటింగ్ మాస్టర్ క్లాస్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఇక 2027 వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ తన ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టనున్నాడని, టీమిండియాకు ఆయన అనుభవం, స్థిరత్వం ముందున్న సవాళ్లలో కీలకంగా మారనున్నాయని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa