పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ IPS సోమవారం ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పోలీసులు ఉపయోగించే ఆయుధాలు, సాంకేతిక పరికరాలు, సైబర్ క్రైమ్, శక్తి యాప్‌ల ప్రాధాన్యతను వివరించారు. జాగిలం హనీ ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఎస్పీ విద్యార్థులకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa