ఆర్టీసీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త వైద్యారోగ్య డిస్పెన్సరీని నిర్మించింది. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో ఈ నూతన భవనాన్ని నిర్మించారు. ఈ నెల 30న ఈ డిస్పెన్సరీని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎండీ ద్వారకా తిరుమలరావు హాజరుకానున్నారు. ఈ కొత్త డిస్పెన్సరీ ద్వారా తిరుపతి జిల్లాలోని 11 డిపోల సిబ్బందితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కలిపి దాదాపు 6,000 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa