నెల్లూరు రూరల్ నియోజకవర్గం మాదరాజుగూడూరు గ్రామంలో రైతులకు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శనివారం యూరియాను పంపిణీ చేశారు. యూరియాపై వదంతులు నమ్మవద్దని, నెల్లూరు రూరల్ లో రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, టిడిపి సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులురెడ్డి, ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa