ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సే ప్రాణాలు తీసింది. అదుపు తప్పిన అంబులెన్స్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మోటార్‌సైకిళ్లపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఓ జంట అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గత రాత్రి సుమారు 11 గంటల సమయంలో బెంగళూరులోని రిచ్‌మండ్ సర్కిల్ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. రెడ్ సిగ్నల్ పడటంతో పలువురు వాహనదారులు తమ బైక్‌లను ఆపి వేచి ఉన్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ అంబులెన్స్ అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది.ప్రమాద తీవ్రతకు మూడు బైక్‌లు నుజ్జునుజ్జయ్యాయి. 40 ఏళ్ల ఇస్మాయిల్, ఆయన భార్య సమీన్ బాను ప్రయాణిస్తున్న డియో స్కూటర్‌ను అంబులెన్స్ బలంగా ఢీకొట్టి, కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.మోటార్ సైకిళ్లను ఢీకొట్టిన తర్వాత అంబులెన్స్ సమీపంలోని పోలీస్ ఔట్‌పోస్ట్‌ను ఢీకొని ఆగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa