జాతీయ గేయాన్ని ఆలపించడాన్ని తప్పనిసరి చేశారు. భారత జాతీయ గేయమైన వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త ఉత్సవాలను ప్రారంభించిన కొద్ది రోజులకే యూపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని గోరఖ్‌పూర్‌లోని ఏక్తా యాత్ర, వందేమాతరం సామూహిక గేయాలాపన కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ నిర్ణయం దేశం పట్ల గౌరవం, గర్వభావాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిందని తెలిపారు. ప్రతి పౌరుడిలో మాతృభూమి పట్ల గౌరవం నింపడానికి వందేమాతరం ఆలపించడం తప్పనిసరి చేస్తామని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా వందేమాతరం గేయాన్ని వ్యతిరేకించే వారిపై యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది భారత సమైక్యతను దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు. జాతీయ గేయాన్ని వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీపై విమర్శలు చేసిన యోగి ఆదిత్యనాథ్.. అలాంటి వ్యక్తులు దేశ సమగ్రతా నిర్మాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని విస్మరించి.. మహ్మద్ ఆలీ జిన్నాకు గౌరవం ఇచ్చే కార్యక్రమాలకు హాజరవుతున్నారని మండిపడ్డారు.
1923లో మొహమ్మద్ అలీ జౌహర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పుడు.. వందేమాతరం గేయాన్ని వ్యతిరేకించడం వల్లే దురదృష్టవశాత్తూ దేశ విభజనకు కారణమైందని ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. భారతదేశ సమగ్రతను సవాలు చేసే కొత్త జిన్నాలు మళ్లీ పుట్టకుండా చూసుకోవాలని.. అలాంటి విచ్ఛిన్నకర ఉద్దేశాలను మొగ్గలోనే తుంచివేయాలని ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
వందేమాతరం జాతీయ గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యూపీ ప్రభుత్వం ఈ ప్రకటనను వెలువరించింది. ఈనెల 7వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో ఏడాది పొడవునా సాగే ఈ వందేమాతరం ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఏడాది నవంబర్ 7వ తేదీ నుంచి 2026 నవంబర్ 7వ తేదీ వరకు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వందేమాతరం గేయాన్ని ప్రఖ్యాత కవి బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ.. 1875 నవంబర్ 7వ తేదీన అక్షయ నవమి సందర్భంగా రచించారు. ఈ గేయం మొదట ఆయన నవల ఆనందమఠ్‌లో భాగంగా 'బంగదర్షన్' అనే సాహిత్య పత్రికలో ప్రచురించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa