ఐపీఎల్ వర్గాల్లో సంచలనం రేపుతున్న మెగా ట్రేడ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) కెప్టెన్ సంజూ శాంసన్ 30వ పుట్టినరోజు సందర్భంగా సీఎస్‌కే అధికారికంగా శుభాకాంక్షలు తెలుపడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. సంజూను సీఎస్‌కేలోకి తీసుకుని, బదులుగా ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను రాజస్థాన్‌కు బదిలీ చేసే డీల్ దాదాపు ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి.ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ క్రిక్‌బజ్ కథనం ప్రకారం ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా ఈ బదిలీకి అంగీకరించారని, రాబోయే 48 గంటల్లో ఈ ప్రక్రియ పూర్తి కావొచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం శాంసన్ పుట్టినరోజున సీఎస్‌కే తమ 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో 'సంజూ.. నీకు మరింత శక్తి చేకూరాలి! సూపర్ బర్త్‌డే శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ ట్రేడ్ వార్తలకు దాదాపు అధికారిక ముద్ర పడినట్లయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa