మంత్రి నారా లోకేశ్ బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు కేంద్ర మంత్రులను ఆహ్వానించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకమైన ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా, కేంద్ర ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యం కూడా ఉండాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను స్వయంగా కలిసి, విశాఖ సదస్సుకు హాజరు కావాలని కోరనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa