ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ తన ఆటతోనే కాకుండా తన స్టైల్‌తోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. టీ20 క్రికెట్‌లో అసాధ్యమనేది ఏదీ లేదని తన విధ్వంసక బ్యాటింగ్‌తో నిరూపిస్తున్న ఈ లెఫ్ట్ హ్యాండర్, తన నమ్మకాన్ని ప్రతిబింబించేలా ఓ కొత్త టాటూ వేయించుకున్నాడు. తన కుడి చేతి మణికట్టుపై 'It will happen' (అది జరుగుతుంది) అని రాసి ఉన్న ఈ టాటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అభిషేక్ శర్మ తన కొత్త టాటూకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. దీనిపై వచ్చిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కేవలం 10 గంటల్లోనే దాదాపు లక్ష లైకులు సంపాదించిందంటే అతని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అతని దూకుడైన ఆటతీరుకు, భారీ లక్ష్యాలను సైతం ఛేదించగలననే ఆత్మవిశ్వాసానికి ఈ టాటూ నిదర్శనమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa