పాకిస్తాన్‌లో జరుగుతున్న శ్రీలంక క్రికెట్ పర్యటనపై ఇస్లామాబాద్‌లో జరిగిన బాంబు పేలుడు తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 27 మందికి పైగా గాయపడ్డారు. భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంక జట్టులోని 8 మంది కీలక ఆటగాళ్లు పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనితో గురువారం జరగాల్సిన రెండో వన్డే రద్దు అయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టు బస్‌పై జరిగిన ఉగ్రదాడిని గుర్తుచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa