హిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇవాళ(ఆదివారం) హిందూపురం మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.తనను మూడుసార్లు గెలిపించిన హిందూపురం ప్రజలకు రుణపడి ఉంటానని బాలకృష్ణ తెలిపారు. హిందూపురం ప్రాంతంలో కొత్త పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతీయువకులను ఆదుకుంటానని భరోసా కల్పించారు. ఏపీ మంత్రులంతా హిందూపురం అభివృద్ధిపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa