మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టి చాలా మంది దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందుకుంటుంటారని చెప్పొచ్చు. చాలా స్కీమ్స్.. ఇన్వెస్టర్లకు కళ్లుచెదిరే రిటర్న్స్ అందించినవి ఉన్నాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా దీనిని ఎంచుకుంటుంటారు. ఇక్కడ రిస్క్ ఉన్నప్పటికీ.. డైవర్సిఫికేషన్ కారణంగా దీనిని తగ్గించుకోవచ్చు. మన పెట్టుబడుల్ని ఆచితూచి.. ఫండ్ మేనేజర్స్ వేర్వేరు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్టాక్ పనితీరును బట్టి మనకు రాబడి వస్తుంది. అయితే.. ఇక్కడ ఏదో ఒకటి, రెండేళ్ల కోసమైతే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు బాగుండవు. 5, 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలవ్యవధి కోసమైతేనే వీటిని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇక్కడ కాంపౌండింగ్ బెనిఫిట్స్ అందుకోవచ్చు.
ఇప్పుడు ఇలానే దీర్ఘకాలంలో కాసుల పంట పండించిన ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి మనం తెలుసుకుందాం. అదే సుందరం మ్యూచువల్ ఫండ్‌కు చెందిన సుందరం ఫోకస్డ్ ఫండ్. ఇది ఇటీవల నవంబర్ 11 నాటికి మార్కెట్లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంటే రెండు దశాబ్దాల మైలురాయిని చేరుకుంది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు మంచి లాభాలు పొందారు.
ఈ స్కీమ్ లాంఛింగ్ నుంచి నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు రూ. 1.12 కోట్లు వచ్చాయి. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కారణంగా.. ఇలా సంపద కొన్నేళ్లలో విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. ఈ ఫోకస్డ్ ఫండ్‌కు.. వాల్యూ రీసెర్చ్, మార్నింగ్‌స్టార్ నుంచి 3 స్టార్ రేటింగ్ వచ్చింది. నెలనెలా రూ. 10 వేల సిప్ చేసిన వారికి ఐదేళ్లలో చూస్తే రూ. 8.17 లక్షలు వచ్చాయి. ఇక్కడ సగటున వార్షిక ప్రాతిపదికన 12.49 XIRR చొప్పున రాబడి పొందారు. ఇదే 10 సంవత్సరాల్లో చూసినట్లయితే రూ. 10 వేల సిప్ కాస్తా రూ. 25.33 లక్షలుగా మారింది. ఇదే మూడేళ్ల కాలంలో చూసినట్లయితే 10 వేల సిప్‌ను రూ. 4.26 లక్షలు చేసింది.
అదే లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూస్తే ఒకేసారి రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఐదేళ్లలో రూ. 2.14 లక్షలు వచ్చాయి. పదేళ్లలో రూ. 3.60 లక్షలు వచ్చాయి. ఇక ఇది 20 ఏళ్లలో చూస్తే రూ. 16.29 లక్షలు వచ్చాయి. ఈ స్కీమ్ 2005, నవంబర్ 11న లాంఛ్ అయింది. సుందరం మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనేజర్, ఈక్విటీ హెడ్‌గా ఎస్. భరత్ ఉన్నారు. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa