ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ నాభి జారినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 10:12 PM

ఆయుర్వేదంలో.. నాభిని శరీరంలోని అతి ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. ఆయుర్వేదం ప్రకారం.. మన నాభి శరీరంలోని 72,000 నరాలతో అనుసంధానించబడి ఉంటుంది. ముఖ్యంగా ఇది జీర్ణ శక్తికి కేంద్రం. అయితే కొన్నిసార్లు భారీ బరువులు ఎత్తడం, వ్యాయామం చేసేటప్పుడు తప్పులు చేయడం, అధిక ఒత్తిడి లేదా అలసట, కడుపుకు గాయం లేదా ఎక్కువసేపు ఖాళీ కడుపు ఉండటం వల్ల నాభి స్థానభ్రంశం చెందుతుంది. అదేనండీ నాభి జారిపోవడం. మన పెద్దలు ఎప్పుడూ ఈ విషయం గురించి అంటూనే ఉంటారు. ఏదైనా కడుపుకి సంబంధిచిన సమస్యలు వస్తే.. నాభి జారిందేమో చూసుకోండి అని అంటారు. నాభి జారడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.


ప్రముఖ ఆయుర్వేద పోషకాహార నిపుణురాలు శ్వేతా షా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో దీనికి సంబంధించి ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో నాభి స్థానం మార్చడం లేదా నాభి జారడం వల్ల కలిగే లక్షణాల్ని గురించి వివరించింది. అలాగే, జారిన నాభిని ఎలా సెట్ చేయాలో చెప్పారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చుద్దాం.


నాభి జారిందని ఎలా తెలుస్తుంది?


న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా మాట్లాడుతూ.. " చాలా మంది క్లయింట్లు నా దగ్గరికి కడుపు సంబంధిత సమస్యలతో వస్తారు. ఇది దాదాపు నాభి స్థానభ్రంశం వల్ల వచ్చే సమస్యలు. మీరు గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, విరేచనాలు వంటి కడుపు సమస్యలతో ఇబ్బంది పడుతూ.. మెడికల్ రిపోర్ట్స్‌లో సాధారణం అని చూపిస్తుంటే అది నాభి జారిపోవడం వల్ల కావచ్చు. కొన్ని సార్లు నాభి కొద్దిగా పైకి, కిందికి లేదా పక్కకు జరుగుతుంది" అని చెప్పుకొచ్చారు.


నాభి స్థానభ్రంశం అయితే కనిపించే లక్షణాలు


​శ్వేతా షా ప్రకారం మీరు ఎప్పుడు ఎసిడిటీ, కడుపులో గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే.. నాభి పైకి కదిలిందని అర్థం చేసుకోండి.


అదే నాభి కిందికి జారినప్పుడు విరేచనాల సమస్యతో బాధపడతారని న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా చెప్పారు.


అదే సమయంలో నాభి కుడి లేదా ఎడమ వైపుకు జరిగితే మలబద్ధకం, అజీర్ణం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయని చెప్పారు.


వీటితో పాటు సాగదీయడం, నొప్పి, కడుపులో వంకరగా అనిపించడం కూడా నాభి జారిందనడానికి సంకేతం కావచ్చని శ్వేతా షా చెప్పారు.


న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా ఏం చెప్పారంటే


నాభి జారితే ఏం చేయాలి?


పోషకాహార నిపుణుల ప్రకారం నాభి జారడం అనేది తీవ్రమైన పరిస్థితి కాదు. కానీ అది జీర్ణక్రియ, శక్తి సమతుల్యతను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. నాభిని సాధారణంగా పల్స్ లేదా టచ్ పద్ధతిని ఉపయోగించి పరీక్షిస్తారు. దీనిని అనుభవజ్ఞుడైన వైద్యుడు లేదా ఎక్స్‌పర్ట్ మాత్రమే చేయగలరు.


ఏ వైద్య పరీక్ష కూడా దీనిని వెల్లడించదు. జీర్ణ సమస్యలు వస్తూ.. ఏ రిపోర్ట్స్ కూడా సరైన కారణాన్ని వెల్లడించకపోతే ఆయుర్వేద నిపుణఉడి ద్వారా నాభిని పరీక్షించుకోవాలని న్యూట్రిషనిస్ట్ చెబుతున్నారు.


ఈ చిట్కాలు పనికొస్తాయి


​నాభి జారిపోతే.. దానిని తిరిగి దాని అసలు స్థానానికి తీసుకురావడానికి మసాజ్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు ఎక్స్‌పర్ట్. మసాజ్ చేయడం కోసం ఎక్స్‌పర్ట్ సాయం తీసుకోండి. చాలా మంది నిపుణులు ఆక్యుప్రెషర్ పాయింట్లు నొక్కడం ద్వారా ఈ సమస్యను పరిష్కారం చూపుతారు.


ఇంకో పద్ధతి కూడా ఉంది. అదే నేలపై పడుకోవడం. అంతేకాకుండా ఒక పిండి దీపం తీసుకోండి. దానిలో నూనె పోసి వెలిగించండి. ఈ దీపాన్ని నాభి మధ్యలో ఉంచండి. దానిపైన తలకిందులుగా ఉన్న గాజు టంబ్లర్ ఉంచండి. గాలి బయటకు రాకుండా కడుపుపై కొద్దిగా ఒత్తిడి చేయండి.


టంబ్లర్ లోపల ఉత్పత్తి అయ్యే ఆవిరి గాజును అంటుకునేలా చేస్తుంది. ఆ తర్వాత గాజు టంబ్లర్‌ని సున్నితంగా ఎత్తండి. ఇది చర్మాన్ని పైకి లేపుతుంది. దీంతో నాభి సరైన స్థానానికి తిరిగి వస్తుంది. అయితే, ఈ చిట్కా పాటించేటప్పుడు సరైన జాగ్రత్త ముఖ్యం.


యోగా కూడా మంచి ఆప్షన్ అంటున్నారు నిపుణులు. నాభి జారిపోయినట్టు అనిపిస్తే భుజాంగాసన, వజ్రాసన, మకరాసన, మత్స్యాసన, చక్రాసన, ధనురాసనాల్ని ప్రాక్టీస్ చేయండి. ఈ ఆసనాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి.


గుర్తించుకోవాల్సిన విషయాలు


​కొబ్బరి నూనె లేదా నెయ్యితో నాభి దగ్గర మసాజ్ చేసుకోవాలని న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా చెబుతున్నారు.


కొబ్బరి నూనె లేదా నెయ్యితో నాభి దగ్గర మసాజ్ చేసుకోవాలని న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా చెబుతున్నారు.


అకస్మాత్తుగా వంగడం, ఎక్కువగా బరువులు ఎత్తడం వంటివి మానుకోండి. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యుణ్ని సంప్రదించి తగిన సలహా తీసుకోండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa