భారత్‌లోని దిగ్గజ విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో ఎయిర్‌లైన్స్ మరోసారి బంపర్ ఆఫర్‌తో వచ్చింది. చాలా తక్కువ ధరకే విమాన ప్రయాణం కల్పించేందుకు బ్లాక్ ఫ్రైడే సేల్ తీసుకొచ్చింది. విమాన టికెట్ ధరలపై డిస్కౌంట్ కల్పిస్తోంది. ఈ స్పెషల్ సేల్‌లో టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు లిమిటెడ్ టైమ్ మాత్రమే ఉంటుంది. నవంబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ అర్ధరాత్రి వరకు అంటే నాలుగు రోజులు మాత్రమే టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి వంటి ముఖ్యమైన పండగలు, పర్వదినాలు సహా వేసవిలో టూర్స్ ప్లాన్ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మరి ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ గురించిన వివరాలు తెలుసుకుందాం.
ఈ ఆఫర్ సమయంలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2026 జనవరి 7వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రయాణం చేయవచ్చు. స్కూల్ హాలిడెస్, సమ్మర్ వెకేషన్, వీకెంట్ ట్రిప్స్ సహా ఒక్కసారైనా విమానం ఎక్కాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. తక్కువ ధరకే ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ టికెట్ వన్ వే ధర కేవలం రూ. 1,799 నుంచే ప్రారంభమవుతుంది. ఇక అంతర్జాతీయ మార్గాల్లో అయితే ఇంటర్నేషనల్ టికెట్ ధర రూ. 5,999 నుంచే మొదలవుతుంది.
డొమెస్టిక్ రూట్స్ (రూ.1,799 టికెట్)
హుబ్బళ్ళి - ముంబై
దిల్లీ - గ్వాలియర్
సూరత్ - గోవా
బెంగళూరు - కర్నూలు
బెంగళూరు - శివమొగ్గ
పూణె - సూరత్
వారణాసి - ఖజురాహో
షిర్డీ - హైదరాబాద్
అహ్మదాబాద్ - అజ్మీర్
ఇంటర్నేషనల్ రూట్స్
చెన్నై - ఢాకా రూ. 5,999
చెన్నై - కొలంబో రూ. 6,599
చెన్నై - సింగపూర్ రూ. 6,899
ముంబై - కాఠ్మండూ రూ. 6,299
కొచ్చి - మాల్దీవ్స్ రూ. 6,699
అబుదాబీ - కోజికోడ్ లేదా కొచ్చిన్ లేదా మంగళూరు రూ. 6,499
దుబాయ్ లేదా మస్కట్ లేదా రాస్ అల్ ఖైమా రూ. 7,000– 7,300 వరకు
వీటితో పాటు చాలా రూట్స్ ఆఫర్లో ఉన్నాయి.
అదనపు బెనిఫిట్స్
ఫాస్ట్ ఫార్వర్డ్ ప్రయారిటీ సర్వీస్ పై 70 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ప్రీ బుక్ మీల్స్ పై 10 శాతం తగ్గింపు లభిస్తుంది.సేల్ నవంబర్ 25–28 వరకే అందుబాటులో ఉంటుంది. ఇండిగో నేరుగా నడిపే విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆఫర్లో సీట్లు లిమిటెడ్‌గా ఉంటాయి. ముందుగా బుక్ చేసిన వారికే ప్రాధాన్యత ఉంటుంది. గ్రూప్ బుకింగ్స్‌కి ఈ ఆఫర్ వర్తించదు. ఇతర పూర్తి వివరాల కోసం ఇండిగో అధికారిక వెబ్సైట్ చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa