ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“కొత్త వైరస్ అలర్ట్: కోవిడ్ కంటే ప్రమాదకరం?”

national |  Suryaa Desk  | Published : Fri, Nov 28, 2025, 08:32 PM

ప్రపంచం కోవిడ్ భయం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. కానీ మరో కొత్త వైరస్ గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. అదే H5 బర్డ్ ఫ్లూ వైరస్. పక్షులు, కోళ్లలో విస్తృతంగా నష్టం కలిగించిన ఈ వైరస్, ఇటీవలి కాలంలో కొన్ని జంతువులకు కూడా సోకడం గమనించబడుతోంది.శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ వైరస్ రూపాంతరం చెంది మనుషులకు సులభంగా వ్యాపించే సామర్థ్యం పొందితే, కోవిడ్-19 కంటే తీవ్రమైన సంక్షోభం సృష్టించే అవకాశం ఉంది.ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ పాశ్చర్ నిపుణురాలు డాక్టర్ మేరీ అన్నే రామీక్స్ వెల్టి చేసిన హెచ్చరిక ప్రకారం—ఈ వైరస్ మనుషి నుండి మనిషికి వ్యాప్తి చెందే రూపం దాల్చితే, పరిస్థితి చాలా క్లిష్టంగా మారొచ్చు. కోవిడ్ ప్రారంభ దశలో మనం సిద్ధంగా లేనట్టే, ప్రస్తుతం కూడా H5 వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ప్రజల్లో తక్కువగానే ఉంది. ఫ్లూ వైరస్‌లు ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, పెద్దలను కూడా తీవ్రమైన స్థాయికి చేర్చగలవని ఆమె అంటున్నారు. అందుకే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి.అయినా, ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదు అని నిపుణులు చెబుతున్నారు. వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ నిపుణుడు డాక్టర్ గ్రెగోరియో టోర్రెస్ ప్రకారం—ఈ వైరస్ మనుషులకు సోకడం ఇప్పటికీ చాలా అరుదుగా జరుగుతోంది. కనుక రోజువారీ జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వైరస్ మ్యూటేట్ అయినా, కోవిడ్-19 ముందున్న పరిస్థితితో పోలిస్తే, ఇప్పుడు ప్రపంచం మరింత ప్రతిస్పందించే సామర్థ్యంతో ఉంది. నిఘా వ్యవస్థలు, వ్యాక్సిన్ అభివృద్ధి సాంకేతికతలు వేగంగా అభివృద్ధి చెందాయి.
*మీరు పాటించాల్సిన జాగ్రత్తలు:
-H5N1 బర్డ్ ఫ్లూ అత్యంత ప్రమాదకరమైన రకాలలో ఒకటి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి:
-అనుమానాస్పద లక్షణాలు ఉన్న పక్షులు లేదా జంతువులకు దూరంగా ఉండండి.
-కోడి మాంసం, గుడ్లు పూర్తిగా ఉడికించకపోతే తినకండి.
-పక్షులు, జంతువులతో పని చేసే వారు వ్యక్తిగత పరిశుభ్రతను తప్పకుండా పాటించాలి.
-మీ పరిసరాల్లో పక్షులు అసాధారణంగా చనిపోతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa