AP: నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుఫాన్ కొనసాగుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతం కారైకాల్‌కి 220, పుదుచ్చేరికి 330, చైన్నైకి 430 కి.మీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 7 కి.మీ. వేగంతో తుఫాన్ ముందుకు కదులుతూ దూసుకొస్తోంది. రేపు తీవ్ర వాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శనివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa