ప్రజెంట్ బిజీ లైఫ్ కారణంగా ప్రతీ ఒక్కదానికి ఎంతో కొంత సమయాన్ని కేటాయించే మనం మనం మన కడుపుకోసం తినే ఫుడ్స్, హెల్త్ విషయంలో చాలావరకూ కాంప్రమైజ్ అవుతున్నాం. దీంతో ఆకలి అయినప్పుడు ఈజీగా దొరికే ఫుడ్స్‌పై ఆధారపడుతున్నాం. ఈ కారణాల వల్ల వాటిలోని ప్రమాదకరమైన పదార్థాలు మన హెల్త్‌తో విచ్చలవిడిగా ఆడుకుంటున్నాయి. అలాంటివాటిలో కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. వాటిని మొత్తానికే అవాయిడ్ చేయాలని చెబుతున్నారు డాక్టర్ హంసాజీ.
అలాంటి ఫుడ్స్ కారణంగానే కొలెస్ట్రాల్ పెరగడమే కాకుండా అధికబరువు, బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలు వస్తాయి. కొన్ని ఫుడ్స్ మనం తిన్నప్పుడు వాటి వల్ల జరిగే ప్రమాదాల గురించి అంతగా పట్టించుకోం. కానీ, అవి మనపై దారుణమైన ఎఫెక్ట్స్‌ని చూపిస్తుందని, వాటిని వెంటనే దూరం పెట్టడం మంచిదని ఆమె చెబుతున్నారు. అలాంటి ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ట్రాన్స్‌ఫ్యాట్స్‌తో గుండె సమస్యలు
ట్రాన్స్‌ఫ్యాట్స్ అనేవి మనం తినే కొన్ని రకాల ఫుడ్స్‌లో ఉంటాయి. ఇవి తిన్నప్పుడు మన బాడీలో ఆటోమేటిగ్గా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇవి ధమనుల్ని ఇరుగ్గా చేసి గుండె సమస్యలు, స్ట్రోక్స్‌కి కారణంగా మారతాయి. అంతేకాదు, వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మన బాడీలో మంచి కొలెస్ట్రాల్ ఉంటే చెడు కొలెస్ట్రాల్ ఆటోమేటిగ్గా తగ్గుతుంది. ట్రాన్స్‌ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు పెరుగుతాయి.
ఫ్యాటీ లివర్, బెల్లీ ఫ్యాట్ ప్రాబ్లమ్స్ కూడా
ట్రాన్స్‌ఫ్యాట్స్ అనేవి బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరగడానికి కారణమవుతుంది. వీటి కారణంగా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఆర్థరైటిస్, డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి ఎన్నో సమస్యలకి కారణమవుతాయి. ట్రాన్స్‌ఫ్యాట్స్ కారణంగా ఇన్సులిన్ పనితీరుపై ఎఫెక్ట్ పడుతుంది. ఈ కారణంగా టైప్ 2 డయాబెటిస్ పెరుగుతుంది. అంతేకాకుండా, లివర్‌లో ఫ్యాట్ పెరిగేలా చేస్తాయి. ఫ్యాటీ లివర్, బెల్లీ ఫ్యాట్ పెరగడానికి కారణమవుతాయి. అధిక బరువు పెరగడానికి కారణమవుతాయి. మీరు కేలరీలని తక్కువగా తీసుకున్నప్పటికీ ట్రాన్స్‌ఫ్యాట్స్ తీసుకుంటే బరువు పెరుగుతారు. అంతేకాకుండా, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. దీంతోపాటు డిప్రెషన్ కూడా పెరుగుతుంది. ట్రాన్స్‌ఫ్యాట్స్ బాడీలో అవయవాల పెరుగుదల, డెవలప్‌మెంట్‌పై ఎఫెక్ట్ చూపిస్తాయి.
ట్రాన్స్‌ఫ్యాట్స్ ఉండే ఫుడ్స్
ప్యాకేజ్డ్ నమ్‌కీన్, మిక్చర్, బయట దొరికే కొన్ని ఫుడ్స్ పానీపూరీ, సమోసాలు చేసేవారు హైజెనిక్‌గా చేయకపోవడం వల్ల ట్రాన్స్‌ఫ్యాట్స్ పెరుగుతాయి. దీనికి కారణం అవి మళ్లీ మళ్లీ వేడి చూసే నూనెలో ఫ్రై చేస్తారు కాబట్టి. ఇలాంటి ఫుడ్స్‌ని తినకపోవడమే మంచిది. వీటి వల్లే బరువు పెరగడం దగ్గర్నుంచీ గుండె సమస్యలు, బెల్లీ ఫ్యాట్, డయాబెటిస్ వంటి సమస్యలొస్తాయి.
బేకింగ్ ఫుడ్స్‌లోనూ ట్రాన్స్‌ఫ్యాట్స్
కేక్స్, కుకీస్, పైస్‌తో పాటు ప్యాకేజ్డ్ ఫుడ్స్, మైక్రోవేవ్ ట్రై చేసిన పాప్‌కార్న్, ఫ్రోజెన్ ఫుడ్స్ అయిన పిజ్జా వంటి ఫుడ్స్, పరాఠా, రోటీస్, ప్రాసెస్డ్ చేసిన ఫుడ్స్ బిస్కెట్స్, రోల్స్, మనం ఆయిల్‌లో రీహీట్ ఛేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి వాటిలోనూ ఎక్కువగా ట్రాన్స్‌ఫ్యాట్స్ ఉంటాయి. పకోడి, బజ్జీలు, డోనట్స్, స్ప్రెడ్స్ చేసుకోవడానికి వాడే మయోనీస్ వంటివి కూడా మంచివి కాదు.
మనం ఇంట్లో చేసుకునే ఫుడ్స్‌తో
మనకి బయట దొరికే పానీపూరీ, పకోడా, బజ్జీలు, సమోసాలు తిన్నప్పుడు అంతగా సమస్యగా అనిపించదు. ఎందుకంటే, మనం వేడి చేసిన నూనెలోనే మళ్లీ మళ్లీ వాడం. బరువు తగ్గాలనుకున్నా, బెల్లీ ఫ్యాట్ ఉండొద్దనుకున్నా ఈ ఫుడ్స్‌ని తగ్గించండి బయట దొరికే ఆయిలీ ఫుడ్స్‌ని తగ్గించండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa