దేశానికి సిద్ధాంత పరమైన రాజకీయాలు, జాతీయవాద భావన అవసరమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఏపీలోని కృష్ణాజిల్లా కంకిపాడులో బీజేపీ జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే చెప్పిన మాటకు కట్టుబడే నీతి నియమం, నిత్యం జనంతో సంపర్కం ఉండాలని, నాయకులు ప్రజలకు దూరంగా ఉండకూడదని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa