ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరుకి 8 కి. మీ. దూరంలో ఉన్న అందాల గ్రామం వంజంగి ఉంది. ఇది మేఘాల కొండ స్వర్గంలో ఉన్న భావన కలిగిస్తుంది. వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి దట్టమైన పొగమంచు కమ్మేయడంతో మరింత ఆహ్లదకరంగా మారిన ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. వంజంగి వ్యూ పాయింట్, కొత్తపల్లి జలపాతాలు, మోదకొండమ్మ ఆలయం, అరకు లోయ వంటి ప్రదేశాలు సందర్శించదగినవి. హైదరాబాద్ నుండి రోడ్డు, రైలు మార్గాల ద్వారా వంజంగి చేరుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa