పవన్ కల్యాణ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. విభిన్న రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, పరిపాలనలో పవన్ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని కొనియాడారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ.. పవన్ పనితీరుకు ఓ ఉదాహరణను వివరించారు.తాజాగా 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన కార్యక్రమంలో, ఓ కానిస్టేబుల్ తన గ్రామానికి సరైన రోడ్డు లేదని ప్రస్తావించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ విషయంపై పవన్ తక్షణమే స్పందించారని తెలిపారు. తన శాఖ అధికారులతో మాట్లాడి, అదే వేదికపై నుంచి ఆ గ్రామానికి రోడ్డు నిర్మాణానికి రూ.3.90 కోట్లు మంజూరు చేయించారని వెల్లడించారు. ఈ వేగవంతమైన పనితీరు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa