AP: సివిల్, ఎపీఎస్‌పీ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని 21 పోలీస్ ట్రైనింగ్ కాలేజీలు, జిల్లా శిక్షణ కేంద్రాలు, బెటాలియన్‌లలో ఈ శిక్షణ ఇవ్వబడుతుంది. అభ్యర్థులు 21వ తేదీన తమకు కేటాయించిన శిక్షణ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబబు వీరికి నియామక పత్రాలు అందజేేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa