పైల్స్ అనే ప్రాబ్లమ్ మలద్వారం లోపల లేదా బాహ్యంగా ఏర్పడతాయి. లోపల ఉండేవి కాస్తా నొప్పి తక్కువగా ఉంటాయి. కానీ, మలవిసర్జన టైమ్‌లో ఎర్రగా మారి వాపు వచ్చి నొప్పి, రక్తస్రావాన్ని కలిగిస్తాయి. బయట వచ్చే పైల్స్ మలద్వారం చుట్టూ చర్మం కింద ఉంటాయి. దురద, చికాకు, వాపు, నొప్పిని కలిగిస్తాయి. పైల్స్ సాధారణంగా పురీషనాళం, ఆసన సిరల్లో పెరిగిన ఒత్తిడి వల్ల వస్తాయి. సాధారణ ప్రమాద కారకాల్లో దీర్ఘకాలిక మలబద్ధకం, విరోచనాలు, మలవిసర్జన సమయంలో ఒత్తిడి, ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకోవడం, ఎక్కువసేపు కూర్చోవడం, ప్రెగ్నెన్సీ, ఊబకాయం, రెగ్యులర్‌గా బరువైన వస్తువులని ఎత్తడం వంటి కారణాల వల్ల వస్తాయి. కొన్నిసార్లు అవి వాటంతట అవే తగ్గిపోతాయి. సమస్య పెరిగితే సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే, పరిస్థితి దిగజారకుండా ఉండాలంటే సర్జరీ లేకుండానే ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చు అని డాక్టర్ అక్షత్ చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటంటే
రెగ్యులర్‌గా మలవిసర్జన జరిగేలా
రెగ్యులర్‌గా మలవిసర్జన జరిగేలా చూసుకోవాలి. రోజుకోసారి విసర్జన జరిగాలి. మలబద్ధకం, లూజ్‌మోషన్స్ వంటివి కాకుండా చూసుకోవాలి. దీనికోసం నీరు ఎక్కువగా తీసుకోవాలి. దీంతోపాటు ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. మలవిసర్జనలో సమస్యలు ఉంటే పైల్స్ వంటి సమస్యలొస్తాయి.
లైట్ వర్కౌట్స్ చేసి రిలాక్స్ అవ్వడం
ఏవైనా లైట్ వర్కౌట్స్ చేయాలి. మైండ్ రిలాక్స్‌గా ఉంటే ఆటోమేటిగ్గా గట్ కూడా రిలాక్స్ అవుతుంది. దీంతో చాలా వరకూ గట్ సమస్యలు రావు. ఏవైనా లైట్ వర్కౌట్స్ చేయాలి. దీంతో వర్కౌట్ చేసినట్లుగా ఉంటుంది. గట్ హెల్త్‌ని కాపాడుకోవాలి.
సరైన ఫుడ్ తీసుకోవడం
సరైన ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువగా ఫైబర్ తీసుకోవాలి. కూరగాయల్ని చక్కగా ఉడికించి తీసుకోవాలి. సూప్స్ తీసుకోవాలి. దీని వల్ల బవెల్ మూమెంట్స్ పెరుగుతాయి. అదేవిధగా, ఫైబర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు అది బయటకి పంపేందుకు నీరు ఎక్కువగా తీసుకోవాలి. దీంతో మలవిసర్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు రావు. ప్రోటీన్ మరీ ఎక్కువగా తీసుకోవద్దు. కార్బ్స్ కూడా తక్కువగానే తీసుకోవాలి.
వంట చేసేటప్పుడు నూనె, నెయ్యి యాడ్ చేయడం
వంట చేసేటప్పు నూనె, నెయ్యితో ఉడికించాలి. అవి చక్కగా ఉడుకుతాయి. నూనె కానీ, నెయ్యి కానీ మరీ ఎక్కువ కానీ, తక్కువగా కానీ వాడొద్దు. సరిపోయేంత వాడాలి. ఇది ఎక్కువైనా, తక్కువైనా సమస్యే. కాబట్టి, నూనె, నెయ్యితో వంట చేయాలి.
మలవిసర్జన ముందు తర్వాత
పైల్స్ కారణంగా కొంతమందికి ఆసనం దగ్గర నొప్పి ఉంటుంది. సమస్య తగ్గేందుకు మలవిసర్జనకి ముందు, తర్వాత కొబ్బరినూనె రాయాలి. దీని వల్ల నొప్పి, వాపు, మంట ఉండదు. ఇది ఆయింట్మెంట్లా పనిచేస్తుంది. మంట, వాపు, నొప్పి తగ్గుతుంది. దీంతోపాటు, అదే విధంగా గోరువెచ్చని లేదా చల్లని నీటిలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసి కరిగించి అందులో మనం ఉండాలి. నొప్పి తగ్గేలా ఉంటుంది. దీని వల్ల నొప్పి ఉండదు. పైగా చాలా వరకూ రిలాక్స్ ఉంటుంది.
నీరు పుష్కలంగా తాగడం
అదే విధంగా రోజుకి కనీసం 2, 3 లీటర్ల నీరు తాగాలి. అందులో 2, 3 గ్లాసుల గోరువెచ్చని నీరు ఉండేలా తీసుకోండి. నీరు ఎంతగా తీసుకుంటే అంతమంచిది. దీని వల్ల కడుపులోని చెత్త మొత్తం బయటికి వెళ్లిపోతుంది.
పండ్లు తీసుకోవడం
రోజూ 2 పండ్లైనా తీసుకోండి. ఉడికించిన ఆహారం బదులు అప్పుడప్పుడు ఇలా తీసుకోండి. దీంతో పాటు 6 లేదా 8 బ్లాక్ రైజిన్స్ లేదా 2, 3 ప్రూన్స్ పండ్లు తీసుకోవాలి. దీని వల్ల మలబద్ధకం తగ్గడానికి హెల్ప్ అవుతుంది.
జీలకర్ర, సోంపు నీరు తాగడం
రోజూ జీలకర్ర లేదా, సోంపు నీటిని మనం తీసుకోవాలి. దీని కోసం ముందురోజు రాత్రి సోంపు లేదా జీలకర్రని నీటిలో నానబెట్టాలి. మరుసటి ఉదయం మరిగించి అది గోరువెచ్చగా అయ్యాక కొద్దిగా నెయ్యి వేసి కలిపి తాగాలి. దీని వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు.
అర్షమొలలు తగ్గేందుకు టిప్స్
ఎక్కువసేపు కూర్చోవద్దు
అదే విధంగా మనం ట్రావెల్ చేసినప్పుడు, వర్క్ చేసినప్పుడు ఎక్కువసేపు కూర్చుంటారు. అలాంటప్పుడు డోనట్ పిల్లో వేసుకుని కూర్చోండి. దీంతో ఎక్కువగా ఇబ్బంది ఉండదు. నొప్పి చాలా వరకూ తగ్గుతుంది.
ఇలాంటి టిప్స్ ఫాలో అయితే చాలా వరకూ నొప్పి తగ్గుతుంది. పైల్స్ నేచురల్‌గానే తగ్గుతాయి. అయితే, కాస్తా టైమ్ పడుతుంది. ఈ అలవాట్లన్నీ కూడా మీ రొటీన్లో మెల్లిగా భాగం చేసుకుంటే సమస్య తగ్గుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa