దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్లో ఉదయం ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రభు యేసుకి ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఆయన, తన ఎక్స్ ఖాతాలో ఈ మేరకు ఫొటోలను షేర్ చేశారు. దేశ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇది ఆనందం, ఉత్సాహాన్ని పంచే పండుగ అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa