భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హైదరాబాద్‌కు చెందిన సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో రూ. 3.6 కోట్లు పెట్టుబడి పెట్టారు. సచిన్ 1.8 లక్షల షేర్లను కొనుగోలు చేసి 2 శాతం వాటాను దక్కించుకున్నారు. 2008లో స్థాపించబడిన ఈ సంస్థ సోలార్ ప్రాజెక్టులలో ప్రత్యేకత కలిగి ఉంది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు కొత్తగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలోనూ విస్తరిస్తోంది. ఆ సంస్థ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చారుగుండ్ల భవానీ సురేశ్, సచిన్ పెట్టుబడి తమ సంస్థకు గర్వకారణమని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa