2026 నూతన సంవత్సరానికి ప్రపంచమంతా స్వాగతం పలుకుతుండగా, వేడుకలు మాత్రం అన్ని చోట్లా ఒకేసారి మొదలవ్వవు. ప్రపంచంలోనే అందరికంటే ముందుగా పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దేశానికి చెందిన కిరితిమతి ద్వీపంలో 2026 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో వేడుకలు మొదలవుతాయి. భారత్ వేడుకలు జరుపుకుంటున్న సమయానికి జపాన్, కొరియా, చైనా ఇప్పటికే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించి ఉంటాయి. చివరగా అమెరికా ఖండం కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa