పత్తికొండ పట్టణంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జై నాగేశ్వరరావు మరణానంతరం ఆదివారం సీఐటీయూ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సీఐటీయూ మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, జై నాగేశ్వరరావు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సీఐటీయూ సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజానాట్యమండలి, డివైఎఫ్ఐ నాయకులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa