సీఎం చంద్రబాబుది పచ్చి అవకాశవాద రాజకీయమని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఆయనకు అలవాటని, అందులో భాగంగానే ఇప్పుడు ఫ్లెక్సీలు, జంతు బలులు అంటూ అనవసర రాద్దాంతం చేస్తున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ నేత సాకే శైలజానాథ్ ఆక్షేపించారు. వైయస్ఆర్సీపీ ఏ హింసనూ ఏనాడూ ప్రోత్సహించలేదన్న ఆయన, నిజానికి ఆ పని తెలుగుదేశం పార్టీ చేస్తోందని స్పష్టం చేశారు. ఫ్లెక్సీల వద్ద పొట్టేళ్లు బలి ఇచ్చారని, యువకులపై కేసు పెట్టిన పోలీసులు, వారిని హింసించి, ఆ తర్వాత నడిరోడ్డుపై నడిపించారని దుయ్యబట్టారు. ఆ స్థాయిలో యువకులను హింసించేంత నేరం వారేం చేశారని నిలదీశారు. గతంలో చంద్రబాబు, ఆయన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫ్లెక్సీల వద్ద కూడా వేర్వేరు సందర్భాల్లో ఇలాగే పొట్టేళ్ల తల కొట్టి, ఆ రక్తంతో ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేశారని సాకే శైలజానాథ్ గుర్తు చేశారు. అవేవీ చంద్రబాబుకు, హోం మంత్రికి కనిపించడం లేదా? అన్న ఆయన, మరి ఆ పని చేసిన టీడీపీ కార్యకర్తలపైనా ఇప్పుడు కేసులు పెడతారా అని, అనంతపురంలో మీడియాతో మాట్లాడిన సాకే శైలజానాథ్ ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa