కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా గుడిబండలో బాలాజీ సింగ్ (30) అనే వ్యక్తి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలాజీ ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆ మహిళకు దూరంగా ఉండాలని బాలాజీ భావించాడు. అయితే, సదరు మహిళ ఆయనను హనీట్రాప్ చేసి, బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధించడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa