ఎమ్మిగనూరు పట్టణంలో రూ.5 కోట్ల వ్యయంతో ఎమ్మిగనూరు–మాలపల్లి–కోసిగి రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 30 ఏళ్ల క్రితం దివంగత నేత బీవీ మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ రహదారి ఆధునీకరణతో రైతులకు పంటల రవాణా సులభతరం అవుతుందని, వ్యాపారులకు, వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యకలాపాలకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్&బీ అధికారులు, మునిసిపల్ కమిషనర్, ఏఎంసీ చైర్మన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa