AP: గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని కొండముది గ్రామంలో శనివారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఓ కుమారుడు తల్లిని హత్య చేశాడు. కొమ్ము జయమ్మ (60) భర్త మూడేళ్ల క్రితం మృతి చెందాడు. కుమారుడు నాగరాజుతో కలిసి నివసిస్తోంది. నాగరాజు మద్యానికి బానిసై నిత్యం తాగుతూ ఉండేవాడు. ఈ విషయంపై రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన నాగరాజు మద్యం మత్తులో తల్లి జయమ్మను రోకలి బండతో తలపై బలంగా దాడి చేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa