ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్య వేగంగా పెరుగుతుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మందికి ఈ సమస్య వస్తుంది. నిండా ముప్పై నిండకముందే తల మొత్తం తెల్ల వెంట్రుకలు వచ్చే సరికి యువత ఆందోళన చెందుతున్నారు. యూవీ కిరణాలకు గురికావడం, సరైన ఆహారం లేకపోవడం, పొల్యూషన్, తలలో రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వంటివి జుట్టు తెల్లబడటానికి కొన్ని ప్రధాన కారణాలు.
ఇక, తెల్ల జుట్టు రావడంతో చాలా మంది మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ డైలు వాడతారు. ఇంకొందరు సెలూన్ షాపుల్లో జుట్టుకు రంగు వేయిస్తారు. అయితే, వీటిలో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా వాడటం వల్ల భవిష్యత్తులో జుట్టుకు డ్యామేజ్ జరుగుతుంది. జుట్టు నిర్జీవంగా మారడం, పొడి బారడం వంటి సమస్యలు వస్తాయి.
అయితే జుట్టుకు ఎటువంటి రంగులు వేయనక్కర్లేదు. సింపుల్ నేచురల్ చిట్కాను షేర్ చేశారు ప్రముఖ న్యాచురోపతిక్ డాక్టర్ శ్రీ సొహమ్ గురూజీ. ఈ చిట్కాను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి పెద్ద పెద్ద వస్తువులు అవసరం లేదు. కేవలం రెండంటే రెండు పదార్థాలు ఉంటే చాలు తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఆ పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.
కావాల్సిన పదార్థాలు
కొబ్బరి నూనె - రెండు పెద్ద టేబుల్ స్పూన్లు
ఉసిరి పొడి - ఒక చెంచా చాలు
తయారీ విధానం
ఇందుకోసం ముందుగా ఒక పాన్ తీసుకోండి. పాన్‌ని స్టౌ మీద పెట్టి అందులో ముందుగా కొబ్బరి నూనె పోయండి. ఇప్పుడు ఒక చెంచా ఉసిరి పొడి కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరిగించండి. నూనె గోల్డెన్ కలర్ లేదా నల్లగా మారే వరకు మరిగించండి. ఆ తర్వాత ఈ నూనె శుభ్రమైన కాటన్ వస్త్రంతో ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు ఒక గాజు సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోండి.
వాడే విధానం ఏంటో తెలుసా?
తెల్ల జుట్టుకు ఈ నూనెను అప్లై చేసుకునేముందు గోరువెచ్చగా చేసుకోండి. దీనిని జుట్టు మూలాలకు గోరువెచ్చగా ఉన్నప్పుడే అప్లై చేయండి. పడుకునే ముందు జుట్టు, మూలాలకు బాగా అప్లై చేయండి. రాత్రంతా అలాగే ఉంచండి.
ఉదయం షాంపూతో తలస్నానం చేయండి. మీరు దానిని రాత్రంతా అలాగే ఉంచలేకపోతే.. తలస్నానం చేసే ముందు అప్లై చేసుకుని రెండు గంటల పాటు అలాగే ఉంచండి. ఈ చిట్కాను రెగ్యులర్‌గా ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయని డాక్టర్ శ్రీ సొహమ్ గురూజీ చెబుతున్నారు.
ప్రయోజనాలేంటో తెలుసా?
జుట్టును నల్లగా చేయడంలో సాయపడుతుంది
కొబ్బరి నూనె, ఉసిరి పొడి రెండింటిలో తెల్ల జుట్టును నల్లగా మార్చే ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లుతో ఉసిరి నిండి ఉంటుంది. కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు E, Kలతో కొబ్బరి నూనె నిండి ఉంటుంది.
ఈ రెండు కలిసినప్పుడు ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఇది తల మీద, జుట్టు కుదుళ్లను పోషించి వాటిని నల్లగా మార్చడంలో సాయపడే శక్తివంతమైన కలయికను సృష్టిస్తుంది. ఇది తెల్ల జుట్టు ఉన్నవారికి మంచి ఆప్షన్.
తలలో రక్త ప్రసరణను పెంచుతుంది
కొబ్బరి నూనె, ఉసిరి పొడి రెండింటిలోనూ కొన్ని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రంగు మెరుగుపర్చడంలో సాయపడతాయి. అంతేకాకుండా ఉసిరిలో ఉండే ఐరన్ తలకు రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టు మూలాల్ని తెరుస్తుంది. దీంతో పోషకాలు జుట్టు మూలాలకు చేరుకుంటాయి. ఈ కలయిక జుట్టును ఎండ నుంచి కాపాడుతుంది. జుట్టును నల్లగా మార్చి.. తెల్ల రంగును నివారిస్తుంది.
ఇంకా ఎన్నో ప్రయోజనాలు
ఈ నూనె పొడి బారిన, చిక్కుబడ్డ జుట్టు సమస్యను కూడా తొలగిస్తుంది. ఇది జుట్టుకు సహజ మెరుపును అందిస్తుంది.
జుట్టు పెరుగుదలను వేగవంతం చేయడంలో సాయపడుతుంది. కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఈ కలయిక తలపై చర్మ అలెర్జీలు, దురద, చుండ్రు మొదలైన వాటిని వదిలించుకోవడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా జుట్టును మూలాల నుంచి బలంగా చేయడంలో సాయపడుతుంది.
ఇది జుట్టుకు తగినంత పోషణను అందిస్తుంది. జుట్టు మందంగా, పొడుగ్గా మార్చడానికి సాయపడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa