AP: రాష్ట్రంలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. స్త్రీశక్తి పథకం వల్ల అధిక రద్దీతో భారం పడుతోందని, దీంతో అదనంగా రూ. 5,200 ఇవ్వడానికి ఆర్టీసీ నిన్న ఆదేశాలు ఇచ్చింది. అయితే, యజమానులు రూ. 15-20 వేల వరకు అదనంగా చెల్లించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 2,500 అద్దె బస్సులున్నాయి. ఇవి సమ్మెలోకి వెళితే సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa