మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, రాజ్‌పుర ఎమ్మెల్యే బాలా బచ్చన్ కుమార్తె ప్రేరణ బచ్చన్, మరో ఇద్దరు మరణించారు. తేజాజి నగర్ బైసాస్ సమీపంలో ట్రక్కును కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న మరో యువతి తీవ్ర గాయాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa