సండే వచ్చిదంటే చాలు చాలా మంది నాన్‌వెజ్ తినడానికి ఆసక్తి చూపుతారు. చికెన్, మటన్, చేపలు, రొయ్యల్ని ఓ పట్టు పట్టేస్తుంటారు. ఇక, నాన్‌వెజ్‌లో ఆరోగ్యకరమైన ఆహారం విషయానికి వస్తే చేపల్ని ఖచ్చితంగా అందులో చేర్చుతారు నిపుణులు. చేపలు అధిక ప్రోటీన్ ఆహారంగా పరిగణించబడుతుంది. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అవి శరీరంలో ఉత్పత్తి కావు.
అందువల్ల, చేపలు తినాలని డాక్టర్లు సలహా ఇస్తారు. ఇక, చేపల్లో కూడా చాలా రకరకాలు ఉంటాయి. బొచ్చె, కొరమేను, పులస, హిలస, ట్యూనా, సాల్మన్ ఇలా రకరకాలుగా ఉంటాయి. చాలా మంచి చేపలు ఫ్రెష్‌గా ఉన్నప్పుడే ఇంటి తెచ్చుకుని పులుసు వండుకుని తింటారు. చేపల పులుసు అంటే చాలా మందికి ఇష్టం. అయితే, ఇంకొందరికి ఎండు చేపలు అంటే చాలా ఇష్టం. అయితే, చాలా మందికి ఓ డౌట్ ఉంటుంది. పచ్చి చేపలు లేదా ఎండు చేపలు దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఏది తింటే ఆరోగ్యానికి మంచిది. ఈ విషయాలపై లైఫ్ కోచ్ డాక్టర్ చిన్నారావ్ క్లారిటీ ఇచ్చారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి చేపల్లో ఉండే పోషకాలు
పచ్చి చేపల్లో అధిక నాణ్యత గల ప్రోటీన్, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12, విటమిన్ డి, అయోడిన్, జింక్, సెలీనియం వంటి కీలక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చేపల్లో కండరాల నిర్మాణానికి అవసరమైన అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది.గుండెతో పాటు మెదడుకు మేలు చేసే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఉత్పత్తి అవ్వవు. అందుకే చేపల్ని తినాలని నిపుణులు సిఫార్స్ చేస్తారు.
ఎండు చేపల్లో ఉండే పోషకాలు
సాధారణంగా పచ్చి చేపల మాదిరిగానే, ఎండిన చేపలు రుచికరమైన, ఆరోగ్యకరమైన పోషకాల్ని కలిగి ఉంటాయి. 100 గ్రాముల ఎండిన చేపలో సుమారు 50 నుంచి 60 గ్రాముల ప్రోటీన్, 1-3 గ్రాముల ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, 500-900 mg కాల్షియం, 5-10 mg ఐరన్, సోడియం ఉంటాయి. చాలా పోషకాలు ఉండటం వల్ల, ఎండిన చేప ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణ చేపలు మాదిరిగానే.. ఎండు చేపలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.
పచ్చి చేపలు తినడం వల్ల ప్రయోజనాలు
శరీర ఆరోగ్యానికి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చాలా అవసరం. అవి చేపల్లో అధిక మొత్తంలో కనిపిస్తాయి. అందువల్ల చేపలు తినడం వల్ల ఒమేగా -3 లోపాన్ని తగ్గించవచ్చు.
ఆహారంలో చేపలు తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందువల్ల, మీ పిల్లల ఆహారంలో చేపల్ని చేర్చడం వల్ల వారి మేధో సామర్థ్యం పెరుగుతుంది. వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అథ్లెట్స్, శారీరక శ్రమలో పాల్గొనేవారికి చేపలు మంచి ఆప్షన్. చేపలు తినడం వల్ల వీరికి మంచి ప్రోటీన్ లభిస్తుంది. చేపల్లో లభించే ప్రోటీన్ కండరాల్ని బలోపేతం చేయడమే కాకుండా వాటిని చురుకుగా, క్రియాత్మకంగా ఉంచడానికి సాయపడతాయి.
సూర్యరశ్మి విటమిన్ డి యొక్క ప్రధాన వనరుగా పరిగణించబడుతుంది. కానీ చేపల్లో విటమిన్ డి కూడా ఉంటుంది. విటమిన్ డి లోపం వల్ల శరీరం కాల్షియంను గ్రహించలేకపోతుంది. దీని వల్ల ఎముకలు బలహీనపడతాయి. అందుకే చేపలు తినడం వల్ల విటమిన్ డి సరైన మోతాదులో లభిస్తుంది.
చేపలు తినడం బలహీనమైన కళ్ళకు మేలు చేస్తుంది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కంటి బలహీనతను తగ్గించడంలో సాయపడతాయని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. రోజూ చేపలు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
ఎండు చేపలు తినడం వల్ల లాభాలు
ఎండిన చేపలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాలను నిర్మించడంలో సాయపడతాయి. బలహీనమైన కండరాలు ఉన్నవారికి లేదా జిమ్‌లో విస్తృతంగా వ్యాయామం చేయడానికి ఇష్టపడే వారికి ఎండిన చేపలు ప్రోటీన్ యొక్క మంచి మూలం.
ఎండిన చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకం కొలెస్ట్రాల్ స్థాయిల్ని సమతుల్యం చేయడానికి, రక్తపోటును నియంత్రించడానికి సాయపడుతుంది. ఎండిన చేపలను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
రక్తపోటు సమస్యలు ఉన్నవారు ఎండు చేపల్ని తీసుకోవడం గురించి ఖచ్చితంగా ఆలోచించాలని డైటీషియన్లు సిఫార్సు చేస్తున్నారు.
ఎండు చేపల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. ఎండిన చేపల్ని తినడం వల్ల జుట్టు రాలడంతో పాటు తెల్ల జుట్టును నివారించవచ్చు,
రెండింటిలో ఏది బెస్ట్?
పచ్చి చేపలు, ఎండు చేపలు రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రెండింటిలోనూ సేమ్ ప్రయోజనాలు ఉంటాయి. మీరు ఫ్రెష్నెష్ కోరుకుంటే పచ్చి చేపలు మంచి ఆప్షన్. రుచిలోనూ, పోషకాలు అందించడంలో పచ్చి చేపలు ముందుంటాయి. ఇక, తక్కువ బడ్జెట్లో ఎక్కువ పోషకాలు అందాలంటే ఎండు చేపలు బెస్ట్.
అయితే, ఎండు చేపలు రక్తపోటు ఉన్నవారికి మంచిది కాదు. ఎందుకంటే ఎండు చేపల్లో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎండు చేపలు వండే ముందు బాగా నీటిలో నానబెట్టాలి. దీంతో సోడియం స్థాయిలు తగ్గుతాయి. ఆ తర్వాత వండుకుని తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa