అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ఖాతాలో వెనుజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకున్నారు. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో వెనుజువెలాపై సైనిక చర్యకు పాల్పడి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన తర్వాత ఈ ప్రకటన చేశారు. వెనుజువెలాలో స్థిరమైన ప్రభుత్వం కొలువు తీరే వరకు తమ పర్యవేక్షణ ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. ఈ చర్య అంతర్జాతీయంగా కొత్త ఆందోళనలకు దారితీసింది. బలమైన దేశాలు బలహీన దేశాలను లక్ష్యంగా చేసుకుంటే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa