ప్యాపిలి మండలం బురుగుల గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం పునరుద్ధరణకు ప్రభుత్వం రూ. 80 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కృషితో ఈ నిధులు మంజూరయ్యాయని గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధితో గ్రామ ఆధ్యాత్మిక వాతావరణం పటిష్ఠమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa