మూడు వన్డే సిరీస్లో భాగంగా హోల్కర్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరిగిన చివరి వన్డేలో టీం ఇండియా లక్ష్య ఛేదనలో తడబడింది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నప్పటి తర్వాత, కివీస్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది.భారీ టార్గెట్తో బరిలోకి దిగిన టీం ఇండియాలో రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు, కేవలం 11 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్మాన్ గిల్ 23 పరుగుల వద్ద, శ్రేయస్ అయ్యర్ 3, కెఎల్ రాహుల్ 1 పరుగుతో ఔటయ్యారు. ఈ సమయంలో క్రీజ్లో ఉన్న విరాట్ కోహ్లీ, నితీశ్ కుమార్ రెడ్డి జతగా స్కోర్ పెంచేందుకు ప్రయత్నించారు.కోహ్లీ-నితీశ్ జోడీ 88 పరుగుల Partnership ఏర్పాటు చేసి ఇద్దరూ అర్థ శతకాలను సాధించగలిగారు. అయితే, 53 పరుగుల వద్ద నితీశ్ క్లార్క్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. 30 ఓవర్లకు భారత్ 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. క్రీజ్లో కోహ్లీ 69, జడేజా 7 పరుగులతో కొనసాగుతున్నారు. మ్యాచ్ విజయం సాధించేందుకు భారత్కు ఇంకా 169 పరుగులు అవసరం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa