పురుషుల ఆసియా కప్, మహిళల వన్డే ప్రపంచ కప్ వంటి ఇటీవల టోర్నీల అనంతరం భారత్ – పాకిస్థాన్ జట్లు మరోసారి టీ20 ప్రపంచ కప్‌లో తలపడనున్నాయి. అయితే పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత వీసాలు నిరాకరించడంతో మ్యాచ్‌ను తటస్థ వేదికైన శ్రీలంకలో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 15న జరగనున్న ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో కూడా ఇరు జట్లు ఎదురుకానున్నాయి. గతంలాగానే ఆటగాళ్ల మధ్య షేక్ హ్యాండ్స్ ఉండకపోవచ్చని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa