అయోధ్యలోని అంతర్జాతీయ రామకథా సంగ్రహాలయానికి (మ్యూజియం) ఒక అరుదైన, చారిత్రక కానుక అందింది. 233 ఏళ్ల నాటి పురాతన వాల్మీకి రామాయణ సంస్కృత గ్రంథాన్ని కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం మంగళవారం శాశ్వతంగా బహూకరించింది. ఢిల్లీలోని తీన్మూర్తి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈ గ్రంథాన్ని ప్రధానుల మ్యూజియం, లైబ్రరీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రాకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాస వరఖేడి అందజేశారు.మహేశ్వర తీర్థ రచించిన 'తత్త్వదీపిక' వ్యాఖ్యానంతో కూడిన ఈ వాల్మీకి రామాయణం దేవనాగరి లిపిలో ఉంది. విక్రమ సంవత్సరం 1849, అంటే 1792లో దీనిని రచించినట్లు ఆధారాలున్నాయి. ఈ గ్రంథంలో బాలకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనే ఐదు ప్రధాన కాండలు ఉన్నాయి. గతంలో దీనిని రాష్ట్రపతి భవన్కు అప్పుగా ఇవ్వగా, ఇప్పుడు శాశ్వతంగా అయోధ్య మ్యూజియానికి అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa