ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాన్యుల కోసం ఎస్బీఐ లో బెస్ట్ పొదుపు స్కీమ్.. నెలకు 100, 500 కడితే

business |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 11:18 PM

రోజు వారీ కూలీలు, నిర్మాణ రంగంలోని కార్మికులు రోజంతా కష్టపడి వచ్చిన కొద్ది డబ్బుతో తమ కుటుంబాన్ని పోషించుకుంటారు. వారు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం అసాధ్యమనే చెప్పాలి. దీంతో కూలీ డబ్బుల్లోంచి కొంత తీసి ఇంట్లో దాచుకుంటుంటారు. అయితే ఇంట్లో దాయడం వల్ల దొంగతనం జరగడం, ఎలుకల బెడత వంటివి ఉంటాయి. అలాంటి సామాన్య ప్రజలు చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అద్భుతమైన పొదుపు పథకం అందిస్తోంది. పొదుపు ఖాతాను మించిన వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. అదే ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఈ స్కీమ్ గురించిన వివరాలు తెలుసుకుందాం.


నిర్ణీత కాలానికి చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునేందుకు ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అవకాశం కల్పిస్తుంది. తమ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునేందుకు చేయూతనిస్తుంది. ఈస్కీమ్ కనీస మెచ్యూరిటీ కాలం 12 నెలలు. గరిష్ఠంగా 120 నెలలు (5 సంవత్సరాలు) పొదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. దేశంలోని అన్ని ఎస్‌బీఐ బ్యాంకు బ్రాంచీల్లో ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.నెలవారీ కనీస డిపాజిట్ రూ.100 మాత్రమే. ఆ తర్వాత ఎంత మొత్తమైనా పొదుపు చేసుకోవచ్చు. అయితే, ప్రతి నెలా టైమ్‌కి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గడువులోగా డబ్బులు కట్టకపోతే పెనాల్టీ ఉంటుంది. వరుసగా ఆరు నెలలు డిపాజిట్ చేయకపోతే అకౌంట్ మూసేస్తారు. ఖాతాదారుకు అందులోని డబ్బులను తిరిగి ఇచ్చేస్తారు.


ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో నెలకు రూ.100 లేదా రూ.500 చొప్పున పొదుపు చేయాలని మీరు అనుకుంటే ఆర్‌డీ ఖాతా తెరవాల్సి ఉంటుంది.మీరు 5 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి ఎంచుకుంటే అప్పుడు వడ్డీ రేటు 6.50 శాతం ఉంటుంది. 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లు అయితే వడ్డీ రేటు 7 శాతంగా ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత ఎంత వస్తుందో ఆన్‌లైన్ కాలిక్యులేటర్ ద్వారా ముందే లెక్కగట్టవచ్చు. నెలకు రూ.100 చొప్పున పొదుపు చేసిన వారికి 5 ఏళ్ల తర్వాత మీ డిపాజిట్ మొత్తం రూ.6 వేలు అవుతుంది. దానిపై వడ్డీ రూ.1,106 వస్తుంది. అంటే అసలు వడ్డీ కలిపి మొత్తం రూ.7,106 వస్తాయి.


ఇక నెలకు రూ.500 చొప్పున పొదుపు చేశారు అనుకుందాం. 5 సంవత్సరాల తర్వాత మీ డిపాజిట్ మొత్తం రూ.30 వేలు అవుతుంది. వడ్డీ రూ.5,528 వస్తుంది. మొత్తంగా అసలు, వడ్డీ కలిపి రూ. 35,528 వస్తాయి. అదే నెలకు రూ.1000 జమ చేస్తే చేతికి అసలు, వడ్డీ కలిపి రూ.71,057 వరకు లభిస్తాయి. సీనియర్ సిటిజన్లు అయితే 7 శాతం వడ్డీ లభిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa