AP: నంద్యాల(D) సిరివెల్లమెట్ట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు, లారీ ఢీకొన్నాయి. నెల్లూరు నుంచి HYD వెళ్తున్న బస్సు టైర్ పేలడంతో డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ చనిపోయారు. వెంటనే మంటలు అంటుకోగా ఓ DCM డ్రైవర్ బస్సు అద్దాలు పగలగొట్టడంతో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు, లారీ పూర్తిగా కాలిపోయాయి. క్షతగాత్రులను నంద్యాల ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa