నాగపూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో 238 పరుగులు చేసిన భారత్ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మరో అరుదైన రికార్డు నెలకొల్పింది. టీ20 ఫార్మాట్లో భారత్ మొత్తం 44 సార్లు 200కు పైగా స్కోర్లు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఏ జట్టుకూ ఇంతవరకు ఈ ఘనత దక్కలేదు. టాప్ ఆర్డర్ నుంచి ఫినిషర్ల వరకు దూకుడుగా ఆడగల లోతైన బ్యాటింగ్ భారత్కు ప్రధాన బలంగా నిలుస్తోంది. ఈ రికార్డు టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహకాల్లో జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa