ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధంగా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా వినతిపత్రం సమర్పించింది. 2024 జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో.. ఏపీకి రాజధానిని తప్పక ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, రాజధానిగా అమరావతి ఎంపిక ప్రక్రియ, నిర్మాణ కార్యక్రమాలపై వివరాలను కూడా కేంద్రానికి నోట్ ద్వారా అందించారు.ఈ విషయమై.. కేంద్రం ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించేసి, నీతి ఆయోగ్ అభిప్రాయాన్ని కూడా కోరినట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యాక పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి అమరావతిని రాజధానిగా చట్టబద్ధంగా ప్రకటించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం సూచించిన ప్రకారం.. 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించేందుకు అన్ని చర్యలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa