పరీక్షల సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకేషనల్ విద్యార్థులకు ఈనెల 27 నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కాగా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ‘నైతికత-మానవ విలువలు’పై బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 39,840 మంది హాజరయ్యారు. 23న పర్యావరణ విద్యపై పరీక్ష జరుగుతుంది. యువతలో నైతిక విలువలు పెంపొందించడం, పర్యావరణం, పచ్చదనంతోనే మానవాళి మనుగడ సాధ్యమని అవగాహన కల్పించడంలో భాగంగా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa