ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-యూరప్ మధ్య సంబంధాలు బలోపేతం అవ్వాలి

international |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 08:06 AM

భారత్‌తో బలోపేతమైన కొత్త అజెండా అమలు చేయడానికి యూరోపియన్ యూనియన్(EU) సిద్ధంగా ఉందని ఈయూ విదేశాంగ విధానం, భద్రతా విధానాల హై రిప్రెజెంటేటివ్ కాజా కల్లాస్ ప్రకటించారు. యూరోపియన్ పార్లమెంట్‌లో ఆమె మాట్లాడుతూ.. భారత్-యూరప్ ఆర్థిక స్థిరత్వానికి ఇది అత్యంత ఆవశ్యకమన్నారు.భారత్‌తో కొత్త సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్‌నర్‌షిప్‌పై ఈయూ అంగీకరించిందని కల్లాస్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఒప్పందం సముద్ర భద్రత, కౌంటర్ టెర్రరిజం, సైబర్ డిఫెన్స్ వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తుంది. ఈ ఒప్పందం మీద వచ్చే వారం న్యూఢిల్లీలో జరిగే 16వ EU-ఇండియా సమ్మిట్‌లో సంతకం చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa