మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, బిజెపి ఇంచార్జి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి శనివారం మంత్రాలయంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రూపొందించిన ఈ కార్యక్రమం ప్రజల జీవితాల్లో నిజమైన మార్పుకు బాటలు వేస్తోందని ఆయన అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి గ్రామానికి ప్రగతి చేరాలన్నదే కూటమి ఆశయమని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa