అయితే, ప్రకృతి అందించే కొన్ని కూరగాయలు రెగ్యులర్‌గా తినడం వల్ల ఎన్నో వ్యాధుల్ని దూరం పెట్టొచ్చు. అలాంటి ఓ కూరగాయ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఆ కూరగాయ ఏంటి అనుకుంటున్నారా? అదే స్ప్రింగ్ ఆనియన్ (ఉల్లి కాడలు). ఇవి చలికాలంలో మార్కెట్లో ఎక్కువగా లభిస్తాయి. చాలా మంది వీటిని కూరల్లో ఉపయోగిస్తారు. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఆయుర్వేద డాక్టర్ స్మిత బోరా చెప్పారు. స్ప్రింగ్ ఆనియన్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ప్రింగ్ ఆనియన్స్ పోషకాల నిలయం
స్ప్రింగ్ ఆనియన్స్‌లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఉల్లికాడలు తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు కలిగిన కూరగాయ. వీటిలో విటమిన్ సి, కె, ఎ, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి.
అంతేకాకుండా స్ప్రింగ్ ఆనియన్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్ సమ్మేళనాలు కూడా ఉన్నాయి. ఇవి నోటి రుచిని పెంచడమే కాకుండా ఎన్నో ప్రయోజనాల్ని అందిస్తాయి. ఈ ఉల్లికాడలు యాంటీబయాటిక్ లక్షణాల్ని కలిగి ఉంటాయి. చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటంలో ఇవి సాయపడతాయి.
రోగనిరధక శక్తిని పెంచుతాయి
శీతాకాలంలో శరీరం చల్లని గాలికి గురైన వెంటనే చాలా ఇన్ఫెక్షన్లకు గురవుతుంది.దీంతో, అనేక సీజనల్ వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే, ఉల్లికాడలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాల్ని కలిగి ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల నుంచి శ్లేష్మాన్ని అంటే కఫాన్ని తొలగించడంలో సాయపడతాయి.
శ్వాసకోశంలో మంట తగ్గించి.. ఉపశమనాన్ని అందిస్తాయి. ఇంకా, చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సాయపడతాయి. ఇది వేడి స్వభావం కలిగి ఉంటుంది. దీనిని తినడం వల్ల స్థిరమైన, సమతుల్య అంతర్గత శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సాయపడుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు గుండె జబ్బులు దూరం
పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల శరీరంలోని తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ఇంకా, పచ్చి ఉల్లిపాయల్లో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ-హైపర్లిపిడెమిక్ లక్షణాల కారణంగా, వాటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఇది గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. అయితే, వీటిని తినడం వల్ల గుండె దెబ్బతినడానికి, రక్తం గడ్డకట్టడానికి ప్రమాద కారకమైన కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడుతుంది.
క్యాన్సర్ నివారణలో కూడా సాయపడుతుంది
ఉల్లికాడలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే అనేక పోషకాల్ని కలిగి ఉంటాయి. వాటిలో అల్లైల్ సల్ఫైడ్ సమ్మేళనం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది ప్రధానంగా క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధించడంలో సాయపడుతుంది.
ఇంకా, స్ప్రింగ్ ఆనియన్స్‌లో ఉండే మిథనాలిక్ కంటెంట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్ప్రింగ్స్ ఆనియన్స్ మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఇతర ప్రయోజనాలపై ఓ లుక్కేయండి
ఇందులో ఉండే విటమిన్ K ఎముక సాంద్రతను నిర్వహిస్తుంది. ఎముకల నష్టాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా, ఎముకల్ని బలంగా ఉంచుతుంది.
ఉల్లికాడలు రక్తంలో సరైన గడ్డకట్టే ప్రక్రియను నిర్వహిస్తాయి. గాయం అయినప్పుడు గడ్డకట్టడం చాలా ముఖ్యం. అలా చేయకపోతే రక్తస్రావం నిరోధిస్తుంది. ప్రాణాంతక పరిస్థితులు తలెత్తవచ్చు.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల డయాబెటిస్ వస్తుంది. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ తినడం వల్ల డయాబెటిస్ తగ్గుతుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని, ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడంలో సాయపడతాయని పరిశోధనలో తేలింది.
అంతేకాకుండా స్ప్రింగ్స్ ఆనియన్స్ చర్మ, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.
వీటిని ఎలా తీసుకోవాలి?
స్ప్రింగ్ ఆనియన్స్‌ని కూరగా చేసుకుని తినవచ్చు. మీరు వాటిని కట్ చేసి సలాడ్లలో యాడ్ చేసి తినవచ్చు. కొంతమంది వీటిని గార్నిషింగ్ కోసం ఉపయోగిస్తారు. వీటిని ఏ రూపంలోనైనా తినవచ్చు. వీటిని సూప్‌ల్లో కూడా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు.
వీటిని వండేముందు బాగా శుభ్రం చేసుకోండి. వాడిపోయిన లేదా తెల్లటి భాగం చివర్లను కత్తిరించుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని వంటలు, సూప్‌లు, ఫ్రైడ్ రైస్, నూడుల్స్ వంటి వాటిలో కూడా ఉపయోగించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa